రైల్వేస్​ సర్వర్లు హ్యాక్​: 3 కోట్ల మంది డేటా లీక్​!

By udayam on December 28th / 10:26 am IST

ఢిల్లీ ఎయిమ్స్ తర్వాత, ఇప్పుడు భారతీయ రైల్వేపై సైబర్ దాడి వార్తలు జోరందుకున్నాయి. రైల్వే టికెట్లు బుక్ చేసుకున్న 3 కోట్ల మంది డేటాను హ్యాకర్లు దొంగిలించినట్లు తెలుస్తోంది. ‘మనీ కంట్రోల్’ వెబ్ సైట్ నివేదిక ప్రకారం, రైల్వేస్ పై సైబర్ దాడి మంగళవారం జరిగినట్లు సమాచారం. ఈ దాడిని షాడో హ్యాకర్​ దాడిగా పిలుస్తున్నారు. అయితే దీనిపై రైల్వే శాఖ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అంతకు ముందు 2020లో హ్యాకర్లు 90 లక్షల మంది వ్యక్తిగత డేటాను దొంగిలించారు.

ట్యాగ్స్​