జూన్​ 17 నుంచి హజ్​ యాత్ర

By udayam on May 24th / 12:48 pm IST

ముస్లింల పవిత్ర యాత్ర హజ్​వచ్చే నెల 17 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు కేంద్ర హజ్​ కమిటీ షెడ్యూల్​ను విడుదల చేసింది. జులై 3 వరకూ జరగనున్న ఈ యాత్రలో తెలంగాణ నుంచి 1822 మందికి అవకాశం దక్కింది. రెండు డోసుల కరోనా టీకాలు వేసుకున్న వారికి మాత్రమే ఈ యాత్రకు అనుమతి ఇవ్వనున్నారు. కరోనా వైరస్​ కారణంగా ఏడాది కూడా 65 ఏళ్ళ లోపు వారికి మాత్రమే హజ్​ కమిటీ షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేసింది. ఎపి నుంచి ఈ యాత్రకు 1200ల మంది వెళ్ళనున్నారు.

ట్యాగ్స్​