జూన్​ 1 నుంచి హాల్​మార్క్​ తప్పనిసరి

By udayam on April 14th / 1:28 pm IST

దేశవ్యాప్తంగా జ్యూయెలరీ షాపుల్లో అమ్మకాలు జరిపే ప్రతీ బంగారు వస్తువు పైనా హాల్​మార్క్​ను జూన్​ 1 నుంచి తప్పనిసరి చేస్తూ కేంద్రం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అప్పట్లోగా దేశంలోని అన్ని బంగారు దుకాణాలు అందుకు సిద్ధం కావాలని ఈ గడువును ఇకపై పెంచేది లేదని వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో అమ్ముడవుతున్న బంగారు వస్తువుల్లో కేవలం 40 శాతం మాత్రమే హాల్​మార్క్​కు చెందినవిగా పేర్కొన్న ప్రభుత్వం ఇకపై షాపుల్లో 14, 18, 22 క్యారెట్ల బంగారు ఆభరణాలను మాత్రమే అది కూడా హాల్​మార్క్​ గుర్తుతో అమ్మాలని పేర్కొంది.

ట్యాగ్స్​