హరనాథ్​ కూతురు పద్మజా రాజు హఠాన్మరణం

By udayam on December 21st / 4:15 am IST

ప్రముఖ నిర్మాత జి.వి.జి.రాజు భార్య పద్మజా రాజు మంగళవారం మధ్యాహ్నం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆమె వయసు 54 సంవత్సరాలు. ఇద్దరు కుమారులు ఉన్నారు. నాటి తరం అందాల హీరో హరనాథ్‌ కు పద్మజా రాజు కూతురు. ఆమె అన్న శ్రీనివాసరాజు కూడా నిర్మాతనే.పద్మజా రాజు భర్త జి.వి.జి.రాజు, పవన్‌ కళ్యాణ్‌ హీరోగా గోకులంలో సీత, తొలిప్రేమ వంటి చిత్రాలు నిర్మించారు. ఆయన శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ‘గోదావరి’ చిత్రం కూడా తెరకెక్కించారు. ఆమె మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

ట్యాగ్స్​