రహానే.. విరాట్​ను అనుసరించకు

అజింక్యాకు హర్భజన్​ సలహా

By udayam on November 20th / 2:45 pm IST

స్టార్​ బ్యాట్స్​మెన్​ విరాట్​ కోహ్లీని అజింక్యా రహానే ఆస్ట్రేలియా పర్యటనలో అనుసరించాల్సిన అవసరం లేదని స్పిన్నర్​ హర్భజన్​ సింగ్​ అభిప్రాయపడ్డాడు.

మొదటి టెస్ట్​ అనంతరం భారత్​కు తిరిగి ప్రయాణమయ్యే విరాట్​ కోహ్లీ.. అనంతరం జరిగే మూడు టెస్ట్​లకు అజింక్యా రహానే కెప్టెన్​గా ఎన్నికైన నేపథ్యంలో హర్భజన్​ ఈ విధంగా స్పందించాడు.

అతడి బ్యాటింగ్​ స్టైల్​ను కానీ, అతడు మైదానంలో ఆవేశంగా ఉండే వ్యక్తిత్వాన్ని కానీ రహానే అనుసరించాల్సిన అవసరం లేదని నీకంటూ ఉన్న సొంత బాడీ లాగ్వేజ్​తోనే టీమ్​ ను నడిపితే బాగుంటుందని సూచించాడు.

‘‘సందేహమే లేదు. విరాట్​కు ఆస్ట్రేలియాలో అద్భుతమైన రికార్డ్​ ఉంది. ఏ బ్యాట్స్​మెన్​ అయినా అతడిని అనుసరించాలని చూస్తారు కూడా. కానీ అజింక్యాకు ఆ అవసరం లేదు. అతడికంటూ సొంత వ్యక్తిత్వం ఉంది. దాంతోనే మిగిలిన మూడు టెస్ట్​లకు టీం ను అద్భుతంగా నడిపించగలడు” అని హర్భజన్​ పేర్కొన్నాడు.