గుజరాత్ కాంగ్రెస్కు గుడ్ బై కొట్టేసిన హార్ధిక్ పటేల్ ఈ గురువారం బిజెపి తీర్థం పుచ్చుకోనున్నాడు. 28 ఏళ్ళ ఈ గుజరాత్ పటీదార్ నేత 2019 నుంచి కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారు. ఇటీవల ఆ పార్టీ అగ్రనాయకత్వంతో పొసగక మే 18న ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే బిజెపిలో చేరతారన్న ప్రచారాన్ని ఇది వరకు ఆయన ఎప్పటికప్పుడు ఖండించినా.. తాజాగా ఆ పార్టీ అధినాయకత్వాన్ని పొడుగుతూ వ్యాఖ్యలు చేయడం ఆయన కమల తీర్థం పుచ్చుకుంటారన్న వార్తలకు బలాన్ని చేకూర్చుతున్నాయి.