పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా పిరియాడికల్ కథాంశంతో భారీ బుడ్జెతో తెరకెక్కుతున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని ఏ ఎమ్ రత్నం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది.అక్టోబర్ చివరి వారం నుండి షెడ్యూల్ ప్రకారం రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్‌లో ‘హరి హర వీరమల్లు’ చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. పవన్ కళ్యాణ్ తో పాటు 900 మంది నటీనటులు.. సిబ్బంది చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ‘హరి హర వీరమల్లు’ ఒక మైలురాయి చిత్రం అవుతుందని.. చిత్ర యూనిట్ వెల్లడించింది.