ఆరోగ్య రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మూడో స్థానంలో నిలిచిందని మంత్రి హరీష్ రావు ప్రకటించారు. కెసిఆర్ నాయకత్వంలో గడిచిన 7 ఏళ్ళలో తెలంగాణ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్న ఆయన బిజెపి పాలిత ఉత్తరప్రదేశ్ ఆరోగ్యంలో అట్టడుగున ఉందని విమర్శించారు. ‘కేరళ, తమిళనాడుల తర్వాత ఆరోగ్యంలో తెలంగాణే టాప్. అదే బిజెపి అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్ దేశంలోనే లాస్ట్. ఇంతకంటే కెసిఆర్ పాలనకు నిదర్శనం ఏం కావాలి?’ అని ఆయన పేర్కొన్నారు.