వెనక్కి వచ్చే ది లేదు

రాజకుటుంబానికి వెల్లడించిన హారీ, మేఘన్​

By udayam on February 20th / 7:38 am IST

రాచరిక హోదాలు తమకు వద్దంటూ బ్రిటన్​ రాజకుటుంబం నుంచి బయటకు వచ్చి కెనెడాలో జీవిస్తున్న ప్రిన్స్​ హ్యారీ ఆయన భార్య మేఘన్​ లు తిరిగి ఎప్పటికీ రాజకుటుంబంతో చేరరని బకింగ్​ హామ్​ ప్యాలస్​ శుక్రవారం వెల్లడించింది.

గత ఏడాది జనవరిలో వీరు రాజప్రసాదాన్ని వీడి ఆర్భాటాలకు, రాచరిక హోదాలకు దూరంగా బతకాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం 4 నెలల గర్భవతిగా ఉన్న మేఘన్​ను తిరిగి రాచరిక కుటుంబంలోకి వచ్చి బిడ్డకు జన్మనివ్వాలంటూ బకింగ్​ హామ్​ ప్యాలెస్​ చేసిన అభ్యర్ధనను సున్నితంగా తిరస్కరించిన విషయం తెలిసిందే.

దీంతో పాటు వారు ఇక ఎన్నటికీ రాజకుటుంబ వ్యవహారాల్లో తలదూర్చబోమంటూ తెగేసి చెప్పేశారని బకింగ్​హామ్​ ప్యాలెస్​ వెల్లడించింది.

ఈ నిర్ణయం మాకు ఎంతో వేదనను మిగిల్చింది. డ్యూక్​, డచెస్​లు మాకు ఎప్పటికీ ఎంతో విలువైన కుటుంబ సభ్యులు అని ప్యాలెస్​ ప్రకటనను విడుదల చేసింది.