రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇచ్చే బియ్యం కోటాలో కోత పెట్టింది. కొత్త రాష్ట్రంలో ఎనిమిదేళ్లుగా అమలు చేస్తున్న 6 కిలోల బియ్యం పథకానికి ముగింపు పలికింది. జాతీయ ఆహార భద్రత కార్డుదారులకు ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున బియ్యం ఇచ్చినట్లుగానే. రాష్ట్ర ఆహార భద్రత కార్డులు కలిగిన వారికీ 5 కిలోల చొప్పునే ఇవ్వనున్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం జారీచేసిన జాతీయ ఆహార భద్రత కార్డులకు 5 కిలోలు ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం మరో కిలో కలిపి 6 కిలోలు ఇచ్చేది.