ఇవే నా చివరి ఎన్నికలు : కుమారస్వామి

By udayam on October 13th / 12:08 pm IST

2023లో కర్ణాటకలో జరిగే అసెంబ్లీ ఎన్నికలే తన చివరి ఎన్నికలని మాజీ సిఎం కుమార స్వామి ప్రకటించారు. కర్ణాటక ప్రజలు ఈసారి జరిగే ఎన్నికల్లో స్వతంత్రంగా పాలించే అధికారాన్ని తమ పార్టీకి అప్పగించాలని ఈ జెడిఎస్​ నేత విజ్ఞప్తి చేశారు. ‘గతంలో 2 సార్లు సిఎం గా చేశా. 2023లో చివరిసారిగా ఎన్నికల్లో పాల్గొనాలనుకుంటున్నా. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు నా విజ్ఞప్తి ఒక్కటే. ఈసారైన తమ పార్టీకి పొత్తులతో సంబంధం లేకుండా అధికారాన్ని అందించాలని కోరుతున్నా. దాంతో 5 ఏళ్ళు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపి అవకాశం ఉంటుంది’ అంటూ పేర్కొన్నారు.

ట్యాగ్స్​