రోడ్డు ప్రమాదంలో ఏ ఆర్ కానిస్టేబుల్ మృతి

By udayam on November 21st / 12:25 pm IST

ప్రకాశం: ప్రకాశం జిల్లాలో నాగులుప్పలపాడు మండలం చదలవాడ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ నాగరాజు మృతి చెందారు.

నాగరాజు ఒంగోలులో ఏఆర్‌హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన విధులు ముగించుకుని స్వగ్రామమైన  వేటపాలెంకు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా   ఈ ప్రమాదం సంభవించింది. పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

విద్యుత్ తీగలు తాకి వ్యక్తి ఆత్మహత్య

తెలంగాణా వరంగల్ పెట్రోల్ పంపు వద్ద గుర్తు తెలియని వ్యక్తి హై టెన్షన్ విద్యుత్ పోల్ ఎక్కి తీగలను పట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు వద్దని వారించినా ఆ వ్యక్తి పట్టించుకోలేదు.

పోలీసులకు వచ్చేసరికే ఆ వ్యక్తి చనిపోయాడు. ఆ వ్యక్తి ఆత్మహత్యను స్థానికులు వీడియో తీశారు. సంఘటనా ప్రదేశానికి  చేరుకున్న పోలీసులు మృత దేహాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.