కరోనాను అడ్డుకోవడానికి దేశీయంగా తయారు చేసిన తొలి వ్యాక్సిన్ ప్యూమోసిల్ను కేంద్ర మంత్రి హర్షవర్ధన్ విడుదల ఈరోజు విడుదల చేశారు.
ఈ వ్యాక్సిన్‌ను బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ సహకారంతో సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేసింది. ఈ వ్యాక్సిన్‌ను దాదాపు 170 దేశాలకు అందించడంతో పాటు, ప్రపంచ జనాభాలో ముగ్గురిలో ఒకరికి అందే విధంగా ఉత్పత్తి చేయనున్నామని కేంద్ర మంత్రి ప్రకటించారు.
దేశీయంగా వ్యాక్సిన్ తయారీకి కావాల్సిన అనుమతుల్ని సీరమ్ ఇన్స్టిట్యూట్ లాక్డౌన్ సమయంలోనే సంపాదించిందని ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ ప్రధాని మోదీ యొక్క ఆత్మనిర్భర్ భారత్ పథకంలో భాగంగా దేశీయ తయారీని పెంచే విధంగా తయారు చేసినట్లు పేర్కొన్నారు.
ఇప్పటికే నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌లో ఈ వ్యాక్సిన్ చాలా సమర్ధవంతంగా పనిచేసిందని, దీని ధరను సైతం దేశంలోని ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తీసుకురానున్నామని కేంద్ర మంత్రి వెల్లడించారు.