హిందువుల పవిత్ర ఛార్ధామ్ యాత్రకు వచ్చిన 39 మంది మరణించారని అధికారులు వెల్లడించారు. కేవలం 2 వారాల వ్యవధిలో ఈ మరణాలు సంభవించాయని తెలిపారు. అధిక రక్తపోటు, గుండె పోటు, మౌంటైన్ సిక్నెస్ల కారణాలతో భక్తులు మరణించారని పేర్కొన్నారు. చాలా మంది యాత్ర మధ్యలో ఉండగానే మరణిస్తున్నారని ఉత్తరాఖండ్ ఆరోగ్య శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ శైలజ భట్ పేర్కొన్నారు. రిషికేష్ సమీపంలో భక్తులకు ఆరోగ్య పరీక్షలు జరిపి అర్హులైన వారినే పంపిస్తున్నట్లు తెలిపారు.