హీత్​ స్ట్రీక్​పై 8 ఏళ్ళ నిషేధం

By udayam on April 14th / 2:22 pm IST

జింబాబ్వే దిగ్గజ ఫాస్ట్​బౌలర్​ హీత్​ స్ట్రీక్​పై ఐసిసి కొరడా ఝలిపించింది. అతడు కోచింగ్​ చేస్తున్న జట్ల వివరాలు బుకీలకు వెల్లడించాడని అతడిపై నమోదైన 5 కేసుల్ని పరిశీలించి అతడిపై ఈ నిషేధం విధించింది. బుకీల నుంచి లంచాన్ని బిట్​కాయిన్ల రూపంలో అతడు తీసుకున్నట్లు తేలడంతో ఈ కఠిన నిషేధం విధించారు. హీత్​ స్ట్రీక్​ జింబాబ్వే జాతీయ జట్టుతో పాటు, ఐపిఎల్​, బిపిఎల్​, ఆఫ్ఘనిస్తాన్​ ప్రీమియర్​ లీగుల్లో సైతం జట్లకు సేవలందించాడు. మొత్తం 35 వేల డాలర్ల విలువైన మొత్తాన్ని బిట్​కాయిన్ల రూపంలో హీత్​స్ట్రీక్​ తీసుకున్నట్లు ఐసిసి వెల్లడించింది.

ట్యాగ్స్​