ఈ వారాంతంలో దేశవ్యాప్తంగా పలుచోట్ల ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్‌ను దాటేస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాయువ్య భారతదేశంతో పాటు పాకిస్థాన్‌లోనూ తీవ్ర వడగాలులు వీస్తాయని తెలిపింది. ఈ ప్రమాదం గతం కంటే 100 రెట్లు అధికంగా ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం జరుగుతున్న వాతావరణ మార్పుల కారణంగా ప్రతీ మూడేళ్ళకూ ఇలా వేడిగాలులు వీస్తాయని, వాతావరణ మార్పులే లేకపోతే 312 ఏళ్ళకు గానీ ఇంతటి భారీ వడగాలులు రావని పేర్కొంది.