నేడు ఎపిలో భారీ వర్షాలు

By udayam on November 27th / 5:05 am IST

బంగాళాఖాతంలో ఏర్పడ్డ తుపాను ధాటికి ఈరోజు ఆంధ్రప్రదేశ్​, తమిళనాడుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పన్రకటించింది. దాంతో పాటు సోమవారం నాటికి కొత్తగా అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ రెండు రాష్ట్రాల్లోని కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని రెడ్​ అలెర్ట్​ జారీ చేసింది. ఎపిలోని యానాం, రాయలసీమల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని, మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని ఐఎండి హెచ్చరించింది.

ట్యాగ్స్​