సౌదీని ముంచెత్తిన భారీ వర్షాలు.. స్కూల్స్​ మూత.. ఫ్లైట్స్​ ఆలస్యం

By udayam on November 25th / 7:54 am IST

ఎడారి దేశం సౌదీ అరేబియాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో ఆ దేశంలోని జెడ్డా నగరం పూర్తిగా వరద నీటిలో మునిగిపోయింది. స్కూల్స్​ మూతపడగా.. విమాన రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. ఈ భారీ వర్షాల వల్ల ఇద్దరు మరణించారని అధికారులు తెలిపారు. మక్కా–జెడ్డా ఎక్స్​ ప్రెస్​ హైవే పైకి వర్షం నీరు పోటెత్తడంతో ట్రాఫిక్​ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గడిచిన 13 ఏళ్ళలో జెడ్డా నగరంలో ఇంత భారీ వర్షం కురవడం ఇదే తొలిసారి అని అధికారులు చెబుతున్నారు.

ట్యాగ్స్​