దేశవ్యాప్తంగా పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లలో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బీహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లలో వచ్చే 3 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈశాన్య భారత దేశంలో వచ్చే 5 రోజుల పాటు కుండపోత వర్షాలు పడతాయని పేర్కొంది. కేరళ, ఒడిశా, అస్సాం, మేఘాలయల్లోనూ 27–28 తేదీల్లో వర్షాలు పడతాయంది.