ఢిల్లీలో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం

By udayam on May 23rd / 6:11 am IST

దేశ రాజధాని ఢిల్లీ భారీ వర్షం కుదిపేసింది. బలమైన ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కురిసిన ఈ వర్షం ధాటికి రాజధానిలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. భారీ వృక్షాలు నేల కూలడంతో విద్యుత్​ సరఫరాకూ తీవ్ర అంతరాయ ంఏర్పడింది. కొన్ని చోట్ల పాడుబడ్డ ఇండ్ల గోడలు కూలిపోయాయి. అయితే ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ఈ రోజంతా భారీ వర్షం కురుస్తుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారులు అప్రమత్తమయ్యారు.

ట్యాగ్స్​