ఎండల ధాటికి అల్లాడిపోతున్న దేశ ప్రజలకు వాతావరణ శాఖ అదిరిపోయే గుడ్న్యూస్ మోసుకొచ్చింది. అండమాన్ నికోబర్ దీవుల్లోకి నైరుతి రుతు పవనాలు వచ్చేశాయని ప్రకటించింది. 23 రోజుల ముందే నైరుతి దేశంలోకి ప్రవేశించిందని పేర్కొంది. వీటి రాకతో ఇప్పటికే అండమాన్ దీవుల్లోనూ, కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నట్లు తెలిపింది. మరో 4 రోజుల పాటు ఇక్కడ వర్షాలు కురవనున్నాయి. రాబోయే 24 గంటల్లో తమిళనాడు, తెలంగాణల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపింది.