రానున్న 3 రోజుల పాటు తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్‌తో పాటు దాని చుట్టుపక్కల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాగల 48 గంటల్లో నైరుతి రుతుపవనాలు ప్రభావంతో ఈ వర్షాలు పడతాయని తెలిపింది. మరో వైపు ఈనెల 27 న రుతుపవనాలు కేరళను తాకనున్నాయని సైతం వాతావరణ శాఖ ప్రకటించింది.