మోడీకి మాతృవియోగం.. అంత్యక్రియల్లో పాడె మోసిన ప్రధాని

By udayam on December 30th / 4:32 am IST

ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్​ (100) కన్నుమూశారు. మంగళవారం రాత్రి నుంచి అహ్మదాబాద్​ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించి మరణించారు. దీంతో హుటాహుటిన ఢిల్లీ నుంచి ఈ ఉదయం అహ్మదాబాద్​ చేరుకున్న మోదీ.. తల్లి పార్ధీవ దేహానికి సాష్టాంగ నమస్కారం చేసి భావోద్వేగానికి గురయ్యారు.మోడి వచ్చిన తర్వాత తల్లి హీరాబెన్‌ అంతిమ యాత్ర ప్రారంభమైంది. ఈ యాత్రలో ప్రోటోకాల్‌ పక్కన పెట్టి తల్లి పాడెను మోడి మోశారు. యాత్ర కొనసాగినంత దూరం వరకూ మోడినే పాడె మోశారు. హీరాబెన్‌ భౌతికకాయాన్ని శ్మశాన వాటికకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేశారు. ఆ వాహనంలో మోడి ఒక్కరే కూర్చున్నారు. గాంధీనగర్‌లో హీరాబెన్‌ భౌతికకాయానికి అంత్యక్రియలు చేశారు. సెక్టార్‌ 30లోని సంస్కార్‌ ధామ్‌లో అంత్యక్రియలు జరిగాయి.

ట్యాగ్స్​