పొలాల్లో పడ్డ వింత వస్తువు..

By udayam on December 7th / 12:21 pm IST

వికారాబాద్‌ జిల్లా మర్పల్లి మండలం మొగిలిగుండ్లలో గగనతలం నుంచి పడిపోయిన ఓ వింత వస్తువు స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. ఈ భారీ వస్తువు ఇక్కడి పొలాల్లో కూలిపోగా, రైతులు వెంటనే అధికారులకు సమాచారం అందించడంతో పొలాల వద్దకు చేరుకుని ఆ వస్తువును పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఇది వాతావరణ మార్పులను పరిశీలించేందుకు ప్రయోగించిన హీలియం బెలూన్‌ అని తెలిపారు. వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేయడం కోసం ఇలాంటి బెలూన్లను గగనతలంలోకి ప్రయోగిస్తుంటారని, ఈ బెలూన్‌ను టాటా ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌ సంస్థ పంపించినట్టు వెల్లడించారు.

ట్యాగ్స్​