‘రాజ్యంగబద్ధ పదవిలో ఉన్నా.. ముఖ్యమంత్రి పారిపోతాడనుకుంటున్నారా.. సమన్లు పంపడం ఇలాగేనా?’ అంటూ జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఈడీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర సర్కార్ చేసిన కుట్రలో భాగంగానే తనను బలిపశువును చేస్తున్నారన్న ఆయన.. ఒక ముఖ్యమంత్రిగా ఉన్న తాను బడా రాజకీయ నాయకుల్లాగా విదేశాలకు పారిపోతానా? అంటూ ప్రశ్నించారు. మనీలాండరింగ్ కేసులో తనకు సమన్లు పంపడాన్ని తప్పుబట్టిన హేమంత్.. తనపై అనర్హత వేటు పడేలా ఉందని చెప్పారు. రాష్ట్రంలోని జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్ ల ఉమ్మడి ప్రభుత్వాన్ని కూల్చడమే బిజెపి పెద్దల లక్ష్యమని ఆరోపించారు.