ఆంధ్రలో కొత్త జిల్లాల లిస్ట్​ ఇదే

By udayam on January 26th / 5:38 am IST

ఎప్పటి నుంచో జరుగుతున్న కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం ఈరోజు గెటిట్​ నోటిఫికేషన్​ను విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం 30 రోజుల్లో అభ్యంతరాలు చెప్పాలని గెజిట్​లో పేర్కొంది. శ్రీకాకుళం, మన్యం (పార్వతీపురం), విజయనగరం, అల్లూరి సీతారామరాజు (పాడేరు), విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ (అమలాపురం), తూర్పుగోదావరి (రాజమహేంద్రవరం), పశ్చిమ గోదావరి (భీమవరం), ఏలూరు, కృష్ణ (మచిలీపట్నం), ఎన్టీఆర్​ (విజయవాడ), గుంటూరు, పల్నాడు (నరసరావు పేట), బాపట్ల, ప్రకాశం (ఒంగోలు), నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి (పుట్టపర్తి), కడప, అన్నమయ్య (రాయచోటి), చిత్తూరు, శ్రీ బాలాజీ (తిరుపతి)లను జిల్లాలుగా ప్రకటించింది.

ట్యాగ్స్​