ఈ సంక్రాంతికి విడుదలవుతున్న విజయ్ మూవీ వారసుడు ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని నటుడు శ్రీకాంత్ వెల్లడించాడు. ఈ మూవీతో తాను తమిళ ఇండస్ట్రీలోకి డెబ్యూ ఇస్తున్నానన్న ఆయన.. దిల్ రాజుతో తనకు ఇదే తొలి సినిమా అని వెల్లడించారు. ఇందులో విజయ్ కు అన్నయ్యగా నటిస్తున్నానని, ఈ సినిమా ఒక ఔటండౌట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని, ఫీల్ గుడ్ ఎమోషన్స్ తో థియేటర్లలో పండగ లాంటి వాతావరణం తీసుకొచ్చే సినిమా.. అని చెప్పుకొచ్చారు.