హెటెరో ఔషధం నిర్మాకామ్‌కు డబ్ల్యూహెచ్‌ఓ సిఫార్సు

By udayam on December 27th / 6:31 am IST

కోవిడ్‌పై పోరుకు హెటెరో అభివృద్ధి చేసిన నిర్మాకామ్‌ జనరిక్‌ వెర్షన్‌కు డబ్ల్యూహెచ్‌ సిఫార్సు లభించింది. నిర్మాట్రెల్విర్‌ 150 ఎంజి (రెండు ట్యాబెట్లు), రిటోనావిర్‌ 100 ఎంజి (ఒక ట్యాబ్లెట్‌) కలిపి నిర్మాకామ్‌ అనే కాంబో ప్యాక్‌ను హెటెరో ప్రారంభించింది. ఈ కాంబో ప్యాక్‌నే డబ్ల్యూహెచ్‌ఓ సిఫార్సు చేసింది. ఆసుపత్రిలో చేరే ప్రమాదం ఎక్కువగా ఉన్న కోవిడ్‌ా19 రోగులకు అంటే వ్యాక్సినేషన్‌ పొందని, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న కోవిడ్‌ రోగులకు నిర్మాత్రెల్వి కార్​రిటోనావిర్‌ను ఇవ్వవచ్చు అని డబ్ల్యూహెచ్‌ఓ సిఫార్స్​ చేసింది.

ట్యాగ్స్​