ఫ్లైట్ మిస్​ : టీ20 ప్రపంచకప్‌కు హిట్​మెయిర్​ దూరం

By udayam on October 4th / 7:34 am IST

ఆస్ట్రేలియాలో జరుగనున్న టీ20 ప్రపంచకప్ ఆడే తమ జట్టులోంచి షిమ్రాన్ హెట్‌మెయిర్‌ను తొలగిస్తున్నట్లు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. అతని స్థానంలో షమ్రా బ్రూక్స్‌ను జట్టులోకి తీసుకుంది. అక్టోబర్ 1న హెట్‌మెయిర్ తన జట్టుతో కలసి ఆస్ట్రేలియాకు వెళ్లాల్సి ఉంది. కానీ, కుటుంబ కారణాల రీత్యా తాను ఆ రోజు వెళ్లలేదు. దీంతో అక్టోబర్ 3న గయానా నుంచి ఆస్ట్రేలియాకు ఒక టికెట్ బుక్ చేశామని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే ఆ ఫ్లైట్​ కూడా అతడు అందుకోలేకపోవడంతో అతడిని జట్టు నుంచి తొలగించినట్లు తెలిపింది.

ట్యాగ్స్​