చిట్‌ఫండ్ కార్యకలాపాలను నిర్వహించే సంస్థలు ప్రభుత్వ అధికారులు ఇచ్చిన నోటీసులకు జవాబు చెప్పాల్సిందేనని మార్గదర్శి చిట్‌ఫండ్ కేసులో హైకోర్టు స్పష్టం చేసింది. అలాగే, చిట్‌ఫండ్ యాక్ట్ 46(3) సెక్షన్‌లో పేర్కొన్న నిబంధనలకు అనుగుణంగా అధికారులు వ్యవహరించాలని తెలిపింది. అప్పటి వరకు మార్గదర్శి విషయంలో బలవంతపు చర్యలు చేపట్టరాదని అధికారులను ఆదేశించింది. రిజిస్ట్రేషన్లు, డాక్యుమెంట్ల స్వీకరణ, అనుమతులు, సెక్యూరిటీ డిపాజింట్ విడుదల వంటి అంశాలన్నింటిలోనూ నిబంధనల మేరకు చేయాలని మధ్యతర ఉత్తర్వులు జారీ చేసింది.