కోర్టు ధిక్కార కేసులో తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (టీటీడీ ఈవో) ధర్మారెడ్డికి హైకోర్టులో ఊరట దక్కింది. సింగిల్ జడ్జి ఇచ్చిన అరెస్ట్ ఆదేశాలపై హైకోర్ట్ డివిజన్ బెంచ్ స్టే విధించింది. ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయంలో టీటీడీ ఈవోకు నెల రోజుల జైలు, రూ.2 వేల జరిమానా విధిస్తూ సింగిల్ జడ్జి రెండు రోజుల క్రితం తీర్పు చెప్పారు. దీనిపై ధర్మారెడ్డి రివిజన్ పిటిషన్ వేయగా దానిపైనే కోర్టు స్టే విధించింది.