పరిషత్​ ఎన్నికలకు హైకోర్టు బ్రేకులు

By udayam on April 6th / 10:52 am IST

ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలో ఈనెల 8న జరగాల్సిన జిల్లా పరిషత్​, మండల పరిషత్​ ఎన్నికలను రాష్ట్ర హైకోర్టు నిలిపివేస్తూ తీర్పు వెల్లడించింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్​ ఇచ్చిన నోటిఫికేషన్​ను రద్దు చేయాలని టిడిపి దాఖలు చేసిన పిటిషన్​పై విచారణ జరిపిన హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు వెలువరించింది. దీంతో ఇప్పటికే ఈ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేసిన ఎలక్షన్​ కమిషన్​కు వీటిని వాయిదా వేయక తప్పలేదు. ఈనెల 15న ఎస్​ఈసి ఈ ఎన్నికల నోటిఫికేషన్​పై అపిడవిట్​ దాఖలు చేయాల్సి ఉంది.

ట్యాగ్స్​