విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ ఏరియాలో చెట్ల నరికివేత చర్యలు నిలిపివేయాలని సోమవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వర్సిటీ పరిధిలో 70 ఎకరాల్లోని చెట్లను అటవీ శాఖ అనుమతి లేకుండా కూల్చేయడం వాల్టా చట్ట నిబంధనలకు వ్యతిరేకమని పేర్కొంటూ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ పిల్ దాఖలు చేశారు. దీనిని చీఫ్ జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ ఎన్.జయసూర్యల డివిజన్ బెంచ్ సోమవారం విచారించింది. ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన నీటి కుంటలను కూడా పూడ్చేస్తున్నారని, ఏళ్ల నాటి భారీ వక్షాలను కూల్చేస్తున్నారని పిటిషనర్ ఆరోపించారు. దీనిపై విచారణ జరిపిన కోర్ట్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.