జిల్లా పేరు మార్పుపై.. భగ్గుమన్న కోనసీమ

By udayam on May 24th / 12:39 pm IST

కోనసీమ జిల్లా పేరును డాక్టర్​ బిఆర్​.అంబేద్కర్​ కోనసీమ జిల్లాగా మార్చడంపై మంగళవారం తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. సెక్షన్​ 144, యాక్ట్​ 30 ఆంక్షలు ఉన్నప్పటికీ వాటిని సైతం లెక్కచేయకుండా నిరసనకారులు వందలాదిగా రోడ్లపైకి వచ్చి బారికేడ్లను ధ్వంసం చేసి కలెక్టరేట్​ వైపు దూసుకెళ్ళారు. కొందరు నిరసనకారులు పోలీసులపైకి రాళ్ళు రువ్వారు. జై కోనసీమ నినాదాలతో వందలాది మంది నిరసనకారులు కలెక్టరేట్​ను ముట్టడించారు.

ట్యాగ్స్​