చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన మూడో రోజు సాగుతోంది. ఆయన ప్రచారవాహనాన్ని పోలీసులు ఇవ్వలేదంటూ తెలుగుదేశం పార్టీ(టీడీపీ) అధినేత చంద్రబాబు నాయుడు గుడుపల్లిలో రోడ్డు మీద కూర్చొని నిరసన తెలియజేశారు. ఆ తరువాత అక్కడే ఒక వాహనం పెట్టుకుని దాని మీదకు ఎక్కి ప్రసంగించారు. ‘వైసీపీ షోలకు పర్మిషన్ ఇచ్చి నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారనీ’ ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
కుప్పం పర్యటనలో ఆంక్షలు విధించడం, పోలీసులు తన ప్రచార వాహనం ఇవ్వక పోవడాన్ని నిరసిస్తూ గుడుపల్లి లో బైఠాయించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ తీరుకు ఆగ్రహిస్తూ … స్వయంగా బస్సుపైకి ఎక్కి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు#CBNInKuppam #RIPDemocracyInAP pic.twitter.com/xkxnKrlsT4
— Telugu Desam Party (@JaiTDP) January 6, 2023