ఇప్పటం: గతంలో ఇచ్చిన తీర్పు మార్చలేం

By udayam on December 14th / 11:08 am IST

ఇప్పటంలో అక్రమ నిర్మాణాలు తొలగింపు వ్యవహారంలో కోర్టును మోసం చేయటంపై 14 మంది పిటిషనర్లకు హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పున జరిమానా విధించింది. అయితే సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ పిటిషనర్లు హైకోర్టులో రిట్‌ ఆప్పీల్‌ దాఖలు చేశారు. పిటిషన్లు దాఖలు చేసిన రిట్‌ అప్పీల్‌ను ధర్మాసనం బుధవారం కొట్టేసింది. పిటిషనర్లు అంతా రైతులేనని, వాళ్లకు తెలియక తప్పు చేశారని ధర్మాసానికి తెలియజేశారు న్యాయవాది. వాళ్లకు తెలియకపోతే మీరు చదువుకున్న వారేగా మీకు తెలియదా అని న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది.

ట్యాగ్స్​