ఆర్ఆర్ఆర్ విడుదలై ఏడాది అయినా ఇప్పటికీ ఎన్టీఆర్ కొత్త మూవీ కోసం ఎలాంటి అప్డేట్ రాక అతడి ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. అయితే ఆ ఎదురుచూపులకు బ్రేక్ ఇస్తూ కొరటాల శివతో ఎన్టీఆర్ నటిస్తున్న కొత్త చిత్రం రిలీజ్ డేట్ ను మేకర్స్ కొత్త సంవత్సరం రోజున రివీల్ చేశారు. #NTR30 ని ప్రపంచవ్యాప్తగా 2024 ఏప్రిల్ 5న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందించనున్నాడు.