ఢిల్లీలోని ప్రపంచ ప్రఖ్యాత కట్టడం కుతుబ్ మినార్ పేరును మార్చాలంటూ మహాకాల్ మానవ్ సేన ఈరోజు ఆ కట్టడం వద్ద నిరసనలకు దిగింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేశారు. ఈ కట్టడం పేరును విష్ణుస్తంభ్ గా మార్చాలంటూ ఆ సంస్థ డిమాండ్ చేస్తోంది. విశ్వహిందూ పరిషత్ నేత ఈ ఏడాది మొదట్లోనే కుతుబ్ మినార్ను విష్ణు స్తంభంగా పేర్కొంటూ చేసిన వ్యాఖ్యల నేపధ్యంలో ఈ నిరసనలు చోటు చేసుకున్నాయి. 1199–1220 మధ్య కుతుబ్ ఉద్దీన్ ఐబక్ దీనిని నిర్మించారు.