పాకిస్థాన్​లో బయటపడ్డ విష్ణు దేవాలయం

1300 ఏళ్ళనాటిదని తేల్చిన నిపుణులు

By udayam on November 21st / 1:50 pm IST

పాకిస్థాన్​లోని స్వాత్​ జిల్లా కొండల్లో 1300 ఏళ్ళనాటి పురాతన విష్ణు దేవాలయం పురాతత్వ తవ్వకాల్లో బయటపడింది. పాకిస్తాన్​, ఇటలీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ ప్రాంతంలో తవ్వకాలు చేపట్టగా ఈ పురాతన దేవాలయం బయటపడిందని ఖైబర్​ పఖ్తుంక్వా డిపార్ట్​మెంట్​ ఆఫ్​ ఆర్కియాలజీ అధికారి ఫజల్​ కాలిఖ్​ తెలిపారు.

1300 ఏళ్ళ క్రితం హిందు షహీల కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అప్పట్లో కాబుల్​ వాలీగా ఉండే ఈ ప్రాంతాన్ని హిందూ షాహీలు కానీ కాబూల్​ హీహీలు కానీ పాలించేవారని ఆయన వివరించారు.

ఈ ఆలయంతో పాటు వాట్​ టవర్స్​, కంటోన్మెంట్​ ప్రాంతాన్ని సైతం శాస్త్రవేత్తలు ఈ తవ్వకాల్లో గుర్తించారు.

ఈ గుడికి సమీపంలోని వాటర్​ ట్యాంక్​ కూడా తవ్వకాల్లో బయటపడిందని, గుడికి వచ్చే వారు దీనిలో స్నానాలు ఆచరించే విధంగా దీనిని తవ్వినట్లు తెలుస్తోందని పేర్కొన్నారు.

దీనిపై ఇటలీ ఆర్కియాలజిస్ట్​ డాక్టర్​ లూకా మాట్లాడుతూ ఈ ఆలయం గాంధార సమాజానికి చెందిన కాలానికి సంబంధించి బయటపడిన మొట్టమొదటి ఆలయమని తెలిపారు.