పాకిస్థాన్ లోని ఓ హిందూ యువతిపై దారుణం జరిగింది. సింధ్ ప్రావిన్స్ కు చెందిన దయా భీల్ (40) అనే మహిళపై అత్యాచారం చేసిన నిందితులు.. ఆపై ఆమె తల నరికి చంపేశారు. ఆమె వక్షోజాలను సైతం కోసేసిన దుండగులు, ఆమె శరీరాన్ని కూడా వలిచేశారని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి దేశంలోని పాకిస్థాన్ రాయబారికి నోటీసులు జారీ చేసింది. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీకి చెందిన భారతీయ హిందువు కృష్ణ కుమారి ఈ ఘోరం జరిగిన గ్రామానికి చేరుకుని బాధితురాలి కుటుంబానికి ధైర్యం చెప్పారు.