ఉగాండ: 2 ఏళ్ళ బాలుడ్ని మింగేసిన హిప్పో.. ఆపై ప్రాణాలతో బయటకు ఊసేసింది

By udayam on December 16th / 10:40 am IST

ఉగాండాలో దారుణ ఘటన జరిగింది. నీటిలో ఆడుకుంటున్న ఇగా పోలా అనే రెండేళ్ళ బాలుడిని మింగేసిన హిప్పో పోటమస్​.. స్థానికులు రాళ్ళ దాడి చేయడంతో వెంటనే అతడిని పూర్తిగా బయటకు ఉమ్మి వేసింది. అప్పటికి బాలుడు బతికే ఉండడంతో వెంటనే ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాలు దక్కాయి. కట్వే కబటోరో టౌన్​ లో ఉన్న నది వద్ద డిసెంబర్​ 4న ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో బాలుడికి చిన్న గాయాలు మాత్రమే అయ్యాయని స్థానికులు తెలిపారు.

ట్యాగ్స్​