అడివి శేష్, మీనాక్షి చౌదరి జంటగా, దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ “హిట్ 2”. డిసెంబర్ 2న విడుదలైన ఈ సినిమా సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులను విశేషంగా అలరించింది. ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చేసింది. అయితే ఇక్కడో చిన్న ట్విస్ట్ ఉంది. ప్రస్తుతం ఈ మూవీని రెంటల్ బేసిస్ లోనే స్ట్రీమింగ్ కు వదిలింది ప్రైమ్ వీడియోస్. సబ్ స్క్రైబర్లకు ఫ్రీగా చూసే అవకాశం మరో 10 రోజుల వరకూ లేదని సమాచారం.