అడివి శేష్ లేటెస్ట్ మూవీ హిట్–2 బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. తాజాగా ఈ మూవీ అమెరికాలో 7 లక్షల డాలర్ల కలెక్షన్లను కొల్లగొట్టింది. కేవలం మూడురోజుల్లోనే ఈ మొత్తాన్ని అందుకుంది. ఆ దేశంలో ఈ మూవీ 300 లకు పైగా ధియేటర్లలో రిలీజ్ అయింది. శైలేష్ కొలను డైరెక్షన్లో వచ్చిన క్రైమ్ సస్పెన్స్ మూవీని వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ పై హీరో నాని, ప్రశాంతి తిపిర్నేనిలు నిర్మించారు.