టాలెంటెడ్ నటుడు అడవి శేష్ హీరోగా తెరకెక్కిన మూవీ హిట్–2 ట్రైలర్ లాంచ్ అయింది. వయలెన్స్ లెవల్స్ భారీగా ఉన్న ఈ ట్రైలర్ లో ఒక హత్య కేసు నిందితుడిని తక్కువగా అంచనా వేసి.. ఆపై అతడిని పట్టుకోవడానికి జట్టు పీక్కునే పోలీసాఫర్ గా శేష్ నటిస్తున్నాడు. రావు రమేష్, మీనాక్షి చౌదరిలు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీకి శైలేశ్ కొలను దర్శకత్వం వహించాడు.మేజర్ వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత శేష్ నుంచి వస్తున్న ఈ మూవీ వచ్చే నెల 2న విడుదల కానుంది.