మేజర్ మూవీతో బాలీవుడ్ లో పాగా వేసిన హీరో అడవి శేష్.. ఇప్పుడు తన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్–2 ను కూడా అక్కడ ధియేటర్లలోకి రిలీజ్ చేయనున్నాడు. శైలేష్ కొలను డైరెక్షన్లో వచ్చిన ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీని ఈనెల 30న హిందీలో రిలీజ్ చేయనున్నాడరు. వాల్ పోస్టర్ బ్యానర్ పై హీరో నాని నిర్మించిన ఈ మూవీలో మీనాక్షిచౌదరి హీరోయిన్ గా చేయగా.. కీలక పాత్రలో సుహాస్ నటించాడు. టాలీవుడ్ లో కలెక్షన్ల వర్షం కురిపించిన హిందీ ప్రేక్షకులను ఎంతమేరకు అలరిస్తుందో చూడాల్సిందే.
#HIT2 in Hindi is now gearing up for a Grand Theatrical Release on Dec 30th 2022 🔥
2 days to go 💥@AdiviSesh @NameisNani @Meenakshiioffl@KolanuSailesh @tprashantii@THEOFFICIALB4U @B4UMotionPics pic.twitter.com/44WzKOGtpQ
— Wall Poster Cinema (@walpostercinema) December 28, 2022