నీళ్ళ జాడ ఉన్న ఎక్సో ప్లానెట్స్​ ను గుర్తించిన హబుల్​

By udayam on December 16th / 12:03 pm IST

నాసాకు చెందిన హబుల్​ టెలిస్కోప్​ మరో రెండు సుదూర గ్రహాల జాడను కనిపెట్టింది. ఈ రెండు గ్రహాల్లోనూ నీరు ద్రవరూపంలో ఉన్నట్లు కూడా గుర్తించింది. ఇవి రెండూ కూడా మన భూమికి 3 రెట్ల సైజులో ఉన్నాయి.. మన భూమి నుంచి 218 కాంతి సంవత్సరాల దూరంలో ఇవి మరో సూర్యుడి చుట్టూ తిరుగుతున్నట్లు తెలిపింది. కెప్లెన్​–138 ప్లానెటరీ సిస్టమ్ కు చెందిన ఈ రెండు వాటర్​ వరల్డ్స్​ ను కెప్లెర్​–138సి, కెప్లర్​–138డి గా శాస్త్రవేత్తలు పిలుస్తున్నారు. అయితే ఈ గ్రహాల్లో మొత్తం నీరు లేదని, చాలా వరకూ హైడ్రోజెన్​ లేదా హీలియం కూడా ఉందని తేల్చారు.

ట్యాగ్స్​