భారత్ లక్ష్యంగా చైనా కుట్రలు..!

By udayam on December 1st / 8:39 am IST

భారత్‌ లక్ష్యంగా చైనా, విదేశాల్లో సైనిక స్థావరాలను ఏర్పాటు చేస్తోంది. హిందూ మహా సముద్రంలో భారీ యుద్ధ నౌకలు, విమాన వాహక నౌకలు, జలాంతర్గాములు మోహరించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనికోసం ఆఫ్రికా ఖండంలోని జిబౌటి దేశంలో తొలి విదేశీ స్థావరాన్ని ఏర్పాటు చేస్తోంది. ఉపగ్రహాలతో పరిశీలించిన అనంతరం ఈ విషయాన్ని అమెరికా రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. జిబౌటి దేశంలో చైనా సైనిక స్థావరాన్ని ఏర్పాటుకు 14 ఏళ్ల క్రితమే ప్రయత్నాలు ప్రారంభించింది. అప్పటి నుంచి ఒక్కొక్కటిగా ఆయుధాలను తరలిస్తోంది.

ట్యాగ్స్​