అజోవ్​స్టాల్​ స్టీల్​ ప్లాంట్​ నుంచి సైనికులు బయటకు

By udayam on May 17th / 8:02 am IST

మరియుపూల్​లోని అజోవ్​స్టాల్​ స్టీల్​ ప్లాంట్​లో చిక్కుకున్న వందలాది తమ సైనికులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఉక్రెయిన్​ ప్రకటించింది. వీరిలో 264 మంది సైనికులను డాన్​బాస్​ ప్రాంతానికి తరలించినట్లు యుక్రెయిన్​ రక్షణ శాఖ వెల్లడించింది. వీరిలో 53 మంది సైనికులు గాయాల బారిన పడ్డట్లు గుర్తించామని వారికి వైద్యం అందిస్తున్నట్లు తెలిపింది. గత నెలలో ఈ ప్లాంట్​ను రష్యా సైనికులు చుట్టుముట్టడంతో వందలాది ఉక్రెయిన్​ సైన్యం ఆ ప్లాంట్​లో చిక్కుకుపోయింది.

ట్యాగ్స్​