మొదలైన కొవాగ్జిన్​ 3వ దశ ట్రయల్స్​

By udayam on November 16th / 1:00 pm IST

హైదరాబాద్​కు చెందిన భారత్​ బయోటెక్​ తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్​ కొవాగ్జిన్​ మూడో దశ ట్రయల్స్​ ప్రారంభించింది.

ఐసిఎంఆర్​ సహకారంతో ఈసారి ఏకంగా 26 వేల మంది వాలంటీర్లను దేశవ్యాప్తంగా ఉన్న 25 సెంటర్ల వద్ద ఈ వ్యాక్సిన్​ ట్రయల్స్​లో పాల్గొననున్నారు.

ఇప్పటి వరకూ భారత్​లో తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్లలో తొలిసారిగా మూడో దశ ట్రయల్స్​ చేస్తున్న తొలి వ్యాక్సిన్​ కొవాగ్జిన్​. 26వేల మందితో భారత్​లో నిర్వహిస్తున్న అతి పెద్ద మూడో దశ ట్రయల్స్​ కూడా ఇదే కావడం విశేషం. ఇప్పటికే ఈ ట్రయల్స్​ నిర్వహణకు డ్రగ్స్​ కంట్రోలర్​ జనరల్​ ఆఫ్​ ఇండియా అనుమతులు మంజూరు చేసింది.

ఈ ట్రయల్స్​ భాగంగా వాలంటీర్లను ఒక సంవత్సరం పాటు పరీక్షలు నిర్వహిస్తారు. ఎలాంటి సైడ్​ ఎఫెక్ట్స్​ వస్తున్నాయో ఈ పరీక్షల ద్వారా నిర్ధారిస్తారు. ఇందులో భాగంగా వాలంటీర్లకు 28 రోజులకు ఒకసారి ఈ వ్యాక్సిన్​ను మొత్తం రెండు సార్లు ఇస్తారు.

ఇప్పటికే ఫేజ్​ –1, ఫేజ్​–2 పరీక్షల్లో దాదాపు 1000 మందికి ఈ వ్యాక్సిన్​ను ఇచ్చి పరీక్షించారు.