టాలీవుడ్ హీరో రాజశేఖర్ తాజా చిత్రం ‘శేఖర్’ ప్రదర్శనను నిలిపేశారు. ఈ చిత్ర ప్రదర్శనను సోమవారం నుంచి ఆపేయాలని కోర్ట్ ఆదేశాల మేరకు డిస్ట్రిబ్యూటర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. హీరో రాజశేఖర్‌తో పాటు ఆయన భార్య జీవిత రాజశేఖర్‌లు ఈ సినిమా కోసం తన వద్ద రూ.65 లక్షలు తీసుకుని తిరిగి చెల్లించడం లేదని పరంధామరెడ్డి కోర్టుకెక్కడంతో అతడికి అనుకూలంగా తీర్పు వచ్చింది. కొందరు కావాలనే తన సినిమాను అడ్డుకుంటున్నారని రాజశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు.
#Shekar pic.twitter.com/JipmYOnh57
— Dr.Rajasekhar (@ActorRajasekhar) May 22, 2022